Current Problem | టేక్మాల్: యాసంగిలో రైతులకు సరిపడా కరెంటు సరఫరా చేయాలని కోరుతూ టేక్మాల్ తహసీల్ధార్ తులసీరామ్కు మెదక్ జిల్లా బీఆర్ఎస్ యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్, మాజీ ఎంపీటీసీ లకావత్ మోహన్ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాసంగిలో వరి పంట సాగు చేసుకోవడానికి బోరుబావులకు 18 గంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేయాలన్నారు.
టేక్మాల్ మండల పరిధిలోని అచ్చన్నపల్లి సబ్ స్టేషన్ పరిధిలో రాత్రి 11గంటలకు ఇవ్వాల్సిన కరెంటును ఉదయం ఇస్తున్నారని, సాయంత్రం 5గంటలకు ఆపేయాల్సి ఉండగా.. గంట ముందుగానే సరఫరా నిలిపివేస్తున్నారని తెలిపారు. 18 గంటలు ఇవ్వాల్సిన కరెంటును 12గంటలు మాత్రమే ఇస్తున్నారని, దీనివల్ల నాట్లు వేయడానికి సరిపడ నీళ్లు అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
రాత్రి 11గంటల నుంచి మరుసటి రోజు 5గంటల వరకు నిరంతరంగా 18 గంటల పాటు విద్యుత్తును సరఫరా చేయాలని కోరారు.