National Flag | నర్సాపూర్, ఆగస్టు 17 : మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం జరిగి మూడు రోజులు కావస్తున్నా జాతీయ జెండాను గద్దెపై నుండి దించడం మరచిపోయారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్న జాతీయ జెండాను పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. పాఠశాల సిబ్బంది జాతీయ జెండాను ఎగరవేసిన సాయంత్రంలోపు జెండాను తీసి భద్రంగా దాచాల్సింది పోయి గాలికి వదిలేశారు.
ఈ విషయంపై పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడిని వివరణ కోరగా.. సెలవు రోజులు ఉన్నవి కాబట్టి జెండాను తీయలేకపోయామని సమాధానం ఇవ్వడం గమనార్హం. మరో ఉపాధ్యాయుడిని ఇదే విషయంపై ఆరా తీయగా తను వచ్చి తీయాల్సింది పోయి తీపిస్తాములే అని సమాధానం చెప్పడం వారికి జాతీయ జెండా పట్ల ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోంది. ఇలాంటి ఉపాధ్యాయులపై దేశం గర్వపేడేలా, జాతీయ జెండా పులకరించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Also :
YS Jagan | జగన్ భార్య వైఎస్ భారతి కూడా బస్సులో ఫ్రీగా వెళ్లొచ్చు.. పీతల సుజాత సెటైర్లు
Heavy Rains | భారీ వర్షం.. గాదిగూడ మండలం రోడ్డు అస్తవ్యస్తం
Pocharam project | పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు