గాదిగూడ : భారీ వర్షాలు ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లాను అతలంకుతలం చేశాయి. ఎడతెరపిలేకుండా రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారి ( Road ) అస్తవ్యస్తంగా తయారయింది. గాదిగూడ ( Gadiguda ) మండలం చిత్తాగూడ, బోడ్డి గూడా తోపాటు పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి భారీ వర్షానికి కోతకు గురై అస్తవ్యస్తంగా మారింది. ఆ గ్రామ నుంచి ప్రజలు నిత్యం మండల కేంద్రానికి వందల సంఖ్యలో రాకపోకలు చేస్తుంటారు.
వర్షానికి ధ్వంసమైన రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే జంకుతున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరి చేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ద్విచక్ర వాహనం వెళ్లలేక అవస్థలు పడవలసిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
ఆదివారం గాదిగూడ మండల వైస్ మాజీ ఎంపీపీ మర్శివాణే యోగేష్ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు సంభవించక ముందే జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.