YS Jagan | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన కానుక స్త్రీ శక్తి పథకమని తెలిపారు. రాఖీ పండుగలా ఈ స్త్రీ శక్తి పథకాన్ని కూడా మహిళలంతా చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. మహిళల కోసం ఇలాంటి మంచి పథకాన్ని ప్రవేశపెడితే వైసీపీ పేటీఎం బ్యాచ్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్త్రీ శక్తి పథకంపై విమర్శలు చేయడం వైసీపీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని పీతల సుజాత విమర్శించారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా జీరో చార్జీతో పులివెందుల నుంచి అమరావతికి రావచ్చని తెలిపారు. కానీ ఆమెకు రాష్ట్రంలోని చిరునామాతో ఉన్న ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు ఉంచాలని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం అందజేశానని పేర్కొన్నారు.
ఆడబిడ్డలను వృద్ధిలోకి తీసుకురావాలన్న సిద్ధాంతమే టీడీపీ విధానమని తెలిపారు. ఆనాడు ఎన్టీఆర్ మహిళల హక్కుల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా అనే విత్తనం వేసి, నేడు కోటిమంది మహిళలు వాళ్ల కుటుంబాలకు ఆసరాగా నిలిచేలా చేశారని కొనియాడారు.