MLA Sunitha Lakshma Reddy | ఉద్యోగం పక్కనపెట్టి ప్రజా సేవకు.. బీఆర్ఎస్తోనే నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
MLA Sunitha Lakshma Reddy | కళ్యాణి ఆనంద్ ఎంబీఏ చదివి ప్రజా సేవకు మీ ముందుకు వచ్చిందని, ప్రతి ఓటరు ఆదరించి గెలిపించాలని నర్సాపూర్ మున్సిపల్ ప్రచారంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఓటర్లను కోరారు.
MLA Sunitha Lakshma Reddy | ఉద్యోగాన్ని పక్కన పెట్టి ప్రజాసేవ కోసం ముందుకొచ్చిన 3వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి కల్యాణిఆనంద్ను కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఓటర్లను కోరారు. బుధవారం నర్సాపూర్ మున్సిపాలటీ 3వ వార్డులో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి కల్యాణి ఆనంద్ తరుపున మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
కళ్యాణి ఆనంద్ ఎంబీఏ చదివి ప్రజా సేవకు మీ ముందుకు వచ్చిందని, ప్రతి ఓటరు ఆదరించి గెలిపించాలని ప్రచారంలో ఎమ్మెల్యే కోరారు. బీఆర్ఎస్ పార్టీతోనే నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటేసి మరోమారు మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
ఈ సందర్భంగా అభ్యర్థి కళ్యాణి ఆనంద్ మాట్లాడుతూ.. కౌన్సిలర్‌గా గెలిపిస్తే మూడవ వార్డులో అండర్ డ్రైనేజ్ పైప్ లైన్, సీసీ రోడ్డు, నీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే నీటి సమస్యను తీర్చడానికి మూడవ వార్డుకు వాటర్ ట్యాంక్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అలాగే బస్తీ దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. వీరితోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.



Read Also :
Suryapet : ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్‌పై వేటు వేయాలి : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
BC JAC : మిర్యాలగూడలో బీసీ జేఏసీ నాయకుల ముందస్తు అరెస్ట్
Arrest : కనగల్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

