పెచ్చులూడినయ్.. ఇనుపచువ్వలు తేలినయ్!
పెచ్చులూడిపోయి.. ఇనుపచువ్వలు తేలి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ బ్రిడ్జి రామడుగు మండలం గుండి గ్రామంలోనిది. సుమారు 20 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ వంతెనను 50 ఏళ్ల కిందట డంగు సున్నంతో నిర్మించారు. ఈ రహదారి సమీపంలోనే పెద్ద చెరువు ఉండడంతో మత్తడి ద్వారా వచ్చే వరదనీరు వెళ్లేలా ఏర్పాటు చేయగా, దశాబ్దాలు గడిచేకొద్దీ శిథిలావస్థకు చేరింది.
- ప్రమాదకరంగా గుండి వంతెన
- కొత్త బ్రిడ్జి నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలోనే నిధులు మంజూరు
- మూడేళ్లు కావస్తున్నా పట్టించుకోని కాంగ్రెస్ సర్కారు
పెచ్చులూడిపోయి.. ఇనుపచువ్వలు తేలి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ బ్రిడ్జి రామడుగు మండలం గుండి గ్రామంలోనిది. సుమారు 20 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ వంతెనను 50 ఏళ్ల కిందట డంగు సున్నంతో నిర్మించారు. ఈ రహదారి సమీపంలోనే పెద్ద చెరువు ఉండడంతో మత్తడి ద్వారా వచ్చే వరదనీరు వెళ్లేలా ఏర్పాటు చేయగా, దశాబ్దాలు గడిచేకొద్దీ శిథిలావస్థకు చేరింది. వంతెన పైభాగంలో గుంతలు ఏర్పడడంతో పాటు పలుసార్లు వరదనీరు వంతెన పైనుంచి వెళ్లడంతో కింది భాగంలో శ్లాబ్ కోసం వేసిన మెటల్ కొట్టుకుపోయి ఇనుప చువ్వలు తేలాయి. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త వంతెన నిర్మాణం కోసం 2023లో రూ.2.15 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో పనుల ప్రారంభం నిలిచిపోయింది. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారింది. దీంతో వాహనదారులు భయం భయంగా బ్రిడ్జి దాటాల్సిన దుస్థితి ఏర్పడింది.
– రామడుగు, ఆగస్టు 3
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

