Narsapur Division | నర్సాపూర్, మార్చి 26 : నర్సాపూర్ రెవెన్యూ డివిజన్‌ను చార్మినార్ (జోన్-6), మల్టీ జోన్-2లో విలీనం చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని నర్సాపూర్ యువకులు కోరారు. ఈ మేరకు వారు ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఆమె నివాసంలో సునీతా లక్ష్మారెడ్డిని కలుసుకొని.. సార్వత్రిక ఉద్యోగ అవకాశాలపై తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు.
ఈ సందర్బంగా యువకులు మాట్లాడుతూ.. నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల (జోన్-3)లో ఉండడంతో నర్సాపూర్ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని, అదనంగా నర్సాపూర్ ప్రాంతం రాజన్న సిరిసిల్ల జోన్లో ఉండడం వల్ల అభివృద్ది పరంగా వెనుకబడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించి అవసరమైన అన్ని చర్యలు తీసుకొని విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యువకులు చౌటి నవీన్, భరత్‌రాం, అభిరామ్, నవదీప్, ఓంకార్, ఉదయ్‌కిరణ్, దీపక్, సుజిత్ పాల్గొన్నారు.
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి