TPTF | మెదక్ మున్సిపాలిటీ, జూన్ 26 : సర్దుబాటు పోరుతో పాఠశాలలను మూసివేసే ప్రక్రియను విరమించుకోవాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, వెంకట్రాంరెడ్డిలు గురువారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి సర్దుబాటు పేరుతో ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. పాఠశాలలను బలోపేతం చేయకుండా ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపకుండా ఏకపక్షంగా సర్దుబాటు చేస్తే పేద పిల్లలు ప్రభుత్వ బడికి దూరం కావాల్సి వస్తుందన్నారు.
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది ఒకటి, ఆచరిస్తోంది ఒకటన్నారు. ఇప్పటికైనా సర్దుబాటు ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు.
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నేడు ఇందిరపార్క్ వద్ద ధర్నా..
ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే విధానాలని ప్రతిఘటిస్తూ విద్యారంగా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, వెంకట్రాంరెడ్డిలు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా గురువారం జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో సంబంధిత పోస్టర్ను టీపీటీఎఫ్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి