farmers Identity Card | నర్సాపూర్, జులై 3 : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కీలకం అయినటువంటి ప్రత్యేక రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యకు రైతులు నమోదు చేసుకోవాలని ఏవో దీపిక పేర్కొన్నారు. నర్సాపూర్ మండల పరిధిలోని రంజ్యాతాండాలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏవో దీపిక గురువారం పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. భూమి ఉన్న ప్రతీ రైతు తప్పనిసరిగా ఈ ప్రత్యేక రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖకు అందించాలని సూచించారు. పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ ఫోన్ నెంబర్ ఏఈవోలకు అందజేయాలని తెలిపారు.
అనంతరం 11 అంకెలతో కూడినటువంటి రైతు విశిష్ట సంఖ్య అందజేయబడుతుందని, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం చేపట్టేటువంటి వివిధ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత ఉండడానికి ఈ విశిష్ట సంఖ్య ఎంతో కీలకమవుతుందని తెలిపారు. ముఖ్యంగా వచ్చే 20వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు విడుదల కావాలంటే ఈ 11 సంఖ్యల రైతు విశిష్ట సంఖ్య తప్పనిసరి అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో తేజస్విని, ఆత్మ బీటీఎం హరిత మరియు రైతులు పాల్గొన్నారు.
SI Rajeshwar | బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
Fake medicines | ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా.. పట్టించుకోని అధికారులు
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్