Collector Rahul Raj | మెదక్ మున్సిపాలిటీ, మార్చి 9 : గురుకులాలు, వసతి గృహాలలో రోజూ వారి మెనూ పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం హవేళి ఘనపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంట గదితోపాటు వంట సరుకులు నిల్వ చేసే గదిని తనిఖీ చేసి పప్పులు, వంట నూనె, బియ్యం, కూరగాయలు, ఆకు కూరలు పరిశీలించి నాణ్యత ప్రమాణాలను తప్పకుండా పాటించాలని సూచించారు.
అనంతరం పాఠశాలలోని ప్రయోగశాల, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తరగతి గదులను తనిఖీ చేసి నిత్యం పరిశుభ్రత చర్యలు చేప్టట్టాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్, సరుకుల నిల్వల రిజిష్టర్, వార్డెన్ల హాజరు రిజిష్టర్లను పరిశీలించి రిజిష్ట్రర్లలో వివరాలను సరైన విధంగా నమోదు చేయాలని, వాటిని సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
అనంతరం విద్యార్థినిలతో మాట్లాడుతూ..ఎక్కడి నుంచి వచ్చారు.. ఎలా చదువుతున్నారు..ఉదయం అల్పహారం, మధ్యాహ్న భోజనం సమయానికి అందిస్తున్నారా అంటూ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించి చక్కగా చదువుకోని ఉన్నత విలువలతో తమ లక్ష్యాలను సాధించాలని విద్యార్థినిలకు సూచించారు.
Rashmi Gautam| రాజమండ్రిలోని గోదావరిలో అస్థికలు కలిపి ఫుల్ ఎమోషనల్ అయిన రష్మీ గౌతమ్
Nama Ravikiran | ఎల్ఆర్ఎస్పై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం : బీఆర్ఎస్ నేత నామ రవికిరణ్
Nizampeta Farmer | రెండు బోర్లు వేసిన.. బొట్టు నీళ్లు పల్లేదంటూ నిజాంపేట యువ రైతు ఆవేదన