Rashmi Gautam| జబర్ధస్త్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ ఇప్పుడు టాప్ యాంకర్స్‌లో ఒకరిగా మారింది. ప్రస్తుతం ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు చేస్తుంది. వీలున్నప్పుడల్లా సినిమాలు చేస్తూ అడపాదడపా సోషల్ మీడియాలో సందడి చేస్తూ అలరిస్తుంటుంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించగా, వారి రొమాంటిక్ ముచ్చట్లు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచాయి. వారిద్దరు పెళ్లి చేసుకుంటారా అనే అనుమానం కూడా కలిగింది. కాని ఇప్పుడు వారిద్దరు ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉన్నారు.
అయితే రష్మీ జంతు ప్రేమికురాలు అన్న విషయం మనందరికి తెలిసిందే. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించి మానవత్వం చాటుకుంది. ఇక జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉంటుంది. ఇటీవల రష్మీ ఇంట్లో బాధాకర సంఘటన చోటు చేసుకుంది. రష్మీ ప్రేమగా పెంచుకుంటున్న తన పెట్ మరణించింది. తన పెంపుడు కుక్కకి రష్మీ చుట్కి గౌతమ్ అని పేరు పెట్టగా, ఆ కుక్క కొద్ది రోజుల క్రితం మరణించింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియ చేసింది రష్మీ.
ఇక ఇప్పుడు ఆమె చుట్కిఅస్తికలని రాజమండ్రి గోదావరి నదిలో కలిపింది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది. మరణించిన సమయంలో కుక్కపై రష్మీ పూలమాలలు వేసిన ఫోటో ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. చుట్కితో ఎంత ప్రేమగా తాను గడిపిందో తెలిసేలా పలు ఫోటోలని రష్మీ షేర్ చేసింది. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం రష్మీ గౌతమ్.. ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆసుపత్రి బెడ్డుపై ఉన్న ఫొటోని షేర్ చేస్తూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. నేను సర్జరీ చేయించుకునేందుకురెడీ అయ్యాను. నా భుజాన్ని సరి చేసుకోవాల్సిన సమయం వచ్చింది. దీని వల్ల నాకు ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నాను అని తెలిపింది. అయితే రష్మీ సర్జరీ సక్సెస్ అయినట్టు తెలుస్తుంది.