Nama Ravikiran | జహీరాబాద్ , మార్చి 9 : ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ ను ఫ్రీగా చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మాట తప్పారని జహీరాబాద్ మునిసిపల్ మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నేత నామ రవికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని ప్రకటించి, ఇప్పుడు మార్చి 31వ తేదీలోపు కడితే 25 శాతం రిబేట్ ఇస్తాననడం ఏమిటని ప్రశ్నించారు. అధికారంలో రాకముందు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని, అధికారంలోకి వచ్చి 25% రిబేటు ఇస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే ఆరు హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని, ప్రభుత్వ తీరు పట్లపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు.
ప్రజల వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొనే ఓడిపోతామని భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చరమగీతం పాడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనను చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు యాకుబ్, బండి మోహన్, శివప్ప, అప్పి రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్