CPS | మెదక్ రూరల్, ఆగస్టు 04 : పీఆర్టీయూటీఎస్ రాష్ట్రశాఖ ఆదేశానుసారం సోమవారం హవేలీ ఘనపూర్ మండల అధ్యక్ష ప్రధాన, కార్యదర్శుల ఆధ్వర్యంలో మండల పరిధి లోని జెడ్పీహెచ్ఎస్ హవేలీ ఘనపూర్, బూరుగుపల్లి, జక్కన్నపేట్ పీఎస్, రాజ్ పేట్ జెడ్పీహెచ్ఎస్, జెడ్పీహెచ్ఎస్ సర్దన, కూచన్‌పల్లి పాఠశాలల్లో పీఆర్టీయూటీఎస్ 2025 సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వ నమోదులో భాగంగా హవేలీ ఘనపూర్ మండలంలోని వివిధ పాఠశాలలను వారు సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకున్నారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ జిల్లా పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు తాళ్ళ శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎల్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 2023 జూలై 1 నుండి అమలు చేయాల్సిన పీఆర్సీ ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచినా నివేదిక వెలువరించకపోవడం అన్యాయమని, వెంటనే పీఆర్సీ నివేదికను బహిర్గత పరిచి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్‌మెంట్‌ను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయుల, ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని, జిపిఎఫ్ లోన్స్, పార్ట్ ఫైనల్, టి జి జి ఎల్ ఐ ఫైనల్ పేమెంట్స్ , సరెండర్ లీవ్స్ తదితర పెండింగ్ బిల్లుల అన్నింటినీ వెంటనే విడుదల చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలానికి వేతనాలు వెంటనే చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి నెలకు 7 వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లుల గురించి విడుదల చేస్తా అని ఇచ్చిన హామీ ప్రకారం వాటిని వెంటనే విడుదల చేసే విధంగా ఆర్థిక శాఖకు ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో హవేలీ ఘనపూర్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర బాధ్యులు త్యార్ల శ్రీనివాస్, కార్యదర్శి రఘుబాబు, మండల ఉపాధ్యక్షులు సంతోష్ కుమారు, సంతోష్, లక్ష్మీకాంతం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Kollapur | ఎంపీ మల్లు రవికి వ్యతిరేకంగా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో
Veerabhadram | దేశ సమగ్రతను, ఆర్థిక రంగాన్ని కాపాడాలి : తమ్మినేని వీరభద్రం
Juluruapadu : మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బాపట్ల మురళి