MLA Sunitha Lakshma Reddy | చిలిపిచెడ్, సెప్టెంబర్ 3 : చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో తొమ్మిదో రోజు మంగళవారం నాడు దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా వేద పండితులు ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో తెలంగాణ రాష్ట్ర, నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు అందరూ పాడి పంటలతో, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం భారీ వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా నష్టపోయారని ఇప్పటికైనా అమ్మవారి దయతో వర్షాలు తగ్గి రైతులకు నష్టాలు వాటిల్లకుండా చూడాలని శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని కోరుకున్నారు.
అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో చిలిపిచెడ్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, నాయకులు లక్ష్మణ్, గోపాల్ రెడ్డి, సయ్యద్ హుస్సేన్, ఎల్లం, ప్రవీణ్, నరసింహారెడ్డి, కిషన్ రెడ్డి, రాకేష్ నాయక్, ఆయా గ్రామ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Karur stampede | కరూర్ తొక్కిసలాట.. యూట్యూబర్ అరెస్ట్
Gorati Venkanna | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ ప్రదానం
Urvashi Rautela | బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌతేలా