Gorati Venkanna | హైదరాబాద్ : రచయిత, ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అంబేద్కర్ విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వీసీ ఘంటా చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. సాహిత్య విభాగంలో గోరటి వెంకన్న చేస్తున్న సేవను గుర్తించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది.