Karur stampede | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కరూర్ జిల్లా (Karur district)లో టీవీకే (TVK) చీఫ్ విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబర్ (YouTuber)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తొక్కిసలాట ఘటనపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో తమిళనాడు యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ (Felix Gerald)ను సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) అరెస్టు చేశారు. అతడు రెడ్పిక్స్ (RedPix) పేరుతో యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై తన ఛానల్లో తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తాజాగా తెలిపారు. ఈ ఘటనపై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న మరో 25 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Also Read..
TVK functionary | టీవీకే కార్యకర్త ఆత్మహత్య.. కరూర్ తొక్కిసలాటకు వాళ్లే బాధ్యులంటూ సూసైడ్ నోట్
Bihar Poll Schedule | వారం రోజుల్లో బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..!