Dhanashree Verma | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రేమ, పెళ్లి, విడాకులు, వివాదాలు, ఆరోపణలతో వీరిద్దరూ నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. ప్రేమించి వివాహం చేసుకున్న ఈ జంట ఈ ఏడాది మార్చిలో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల (divorce) అనంతరం ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీగా మారిపోయారు. తాజాగా చాహల్‌తో తన వివాహ బంధం గురించి ధనశ్రీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ బంధం మొదటి నుంచీ ఇబ్బందుల్లోనే ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం రైజ్ అండ్ ఫాల్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న ధనశ్రీ.. తన వివాహం, విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. వివాహం జరిగిన రెండు నెలల్లోనే చాహల్ మోసం బయటపడిందంటూ చెప్పుకొచ్చారు. ఈ షోలో తన వివాహ బంధంపై ధనశ్రీ వర్మకు ఓ ప్రశ్న ఎదురైంది. చాహల్‌ను పెళ్లి చేసుకొని పొరపాటు చేశానని మీకెప్పుడు అనిపించింది..? అని ఓ కంటెస్టెంట్ ధనశ్రీని అడిగారు. దీనికి ధనశ్రీ స్పందిస్తూ.. ‘పెళ్లైన మొదటి సంవత్సరం.. రెండో నెలలోనే అతడిని పట్టుకున్నా’ అంటూ సమాధానమిచ్చింది. ఆమె కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
విడాకుల తర్వాత ధనశ్రీ పెద్ద మొత్తంలో భరణం డిమాండ్ చేసిందనే వార్తలొచ్చాయి. ఈ వార్తలపై ధనశ్రీ ఇటీవలే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అవన్నీ ఫేక్ వార్తలు అంటూ కొట్టిపారేశారు. ‘నేను, చాహల్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. కానీ, నేను ఏమీ మాట్లాడటం లేదని భరణం గురించి ఎవేవో కథనాలు వ్యాపింపజేస్తున్నారు. నాకు నచ్చిన విషయాలపై దృష్టి సారించాలని అమ్మానాన్న సూచించారు. అయినా.. జనాలకు ఇవన్నీ చెప్పి సమయం వృథా చేసుకోవడం నాకు నచ్చదు. ఇక భరణం విషయానికొస్తే అది నాకు అవసరం లేదు. కానీ, నేను రూ. 60 కోట్లు డిమాండ్ చేశానని అందరూ అనుకుంటున్నారు.
ఇవన్నీ నిరాధారమైనవి. నేను అంత మొత్తాన్ని డిమాండ్ చేయలేదు. పైగా చాహల్ నుంచి నాకు ఇంతమొత్తం ఇస్తామని సందేశం కూడా రాలేదు. ఈ విషప్రచారం నిజం కాదు. బాధ్యతలేని సంస్థలు తమ ప్రయోజనం కోసం కుటుంబాలను వివాదాల్లోకి లాగుతుంటాయి. ఇలాంటి వార్తలు హానిచేస్తాయి. అందుకే మీడియాను నేను కోరేది ఒక్కటే. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి’ అని ధనశ్రీ వర్మ సున్నితంగా హెచ్చరించింది.
దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న చాహల్‌ను వివాహం చేసుకుంది. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలు విడాకులకు దారి తీశాయి. 2020లో వీరి వివాహం జరగగా 2022 నుంచే ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్న ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ ఏడాది మార్చి 20న వీరికి విడాకులు మంజూరయ్యాయి.
Also Read..
Bihar Poll Schedule | వారం రోజుల్లో బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..!
PM Modi | పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతికి మార్గం.. గాజాపై ట్రంప్ ఫార్ములాను స్వాగతించిన భారత్
Earthquake | మయన్మార్‌లో భూకంపం.. అస్సాం, మణిపూర్, నాగాలాండ్‌లో ప్రకంపణలు