Earthquake | మయన్మార్‌లో భూకంపం.. అస్సాం, మణిపూర్, నాగాలాండ్‌లో ప్రకంపణలు
మయన్మార్‌లో భారత సరిహద్దుల వెంబడి స్వల్ప భూకంపం వచ్చింది. మంగళవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.7గా నమోదయింది. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు 27 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉండటంతో ఆ రాష్ట్రంతోపాటు నాగాలాండ్, అస్సాంలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
న్యూఢిల్లీ: మయన్మార్‌లో భారత సరిహద్దుల వెంబడి స్వల్ప భూకంపం వచ్చింది. మంగళవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.7గా నమోదయింది. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు 27 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉండటంతో ఆ రాష్ట్రంతోపాటు నాగాలాండ్, అస్సాంలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. భూ అంతర్భాగంలో 15 కిలోమీట్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ (NCS) తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉన్నది.
కాగా, సోమవారం అర్ధరాత్రి 12.09 గంటల సమయంలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో కూడా భూమి కంపించింది. దీని తీవ్రత 3.4గా ఉందని ఎన్సీఎస్ వెల్లడించింది. ఇక టిబెట్‌లో కూడా మంగళవారం ఉదయం భూకంపం వచ్చింది. ఉదయం 4.28 గంటలకు 3.3 తీవ్రత ప్రకంపణలు వచ్చాయి. అస్సాంలోని దిబ్రూగఢ్‌కు 303 కిలోమీటర్లు, అరుణచల్ ప్రదేశ్‌లోని పంగిన్కు 227 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నదని పేర్కొంది.
EQ of M: 4.7, On: 30/09/2025 06:10:01 IST, Lat: 24.73 N, Long: 94.63 E, Depth: 15 Km, Location: Myanmar.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/a9NPFppDYI— National Center for Seismology (@NCS_Earthquake) September 30, 2025
EQ of M: 3.3, On: 30/09/2025 04:28:36 IST, Lat: 30.19 N, Long: 95.23 E, Depth: 10 Km, Location: Tibet.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/KSRWZwLgZ0— National Center for Seismology (@NCS_Earthquake) September 29, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- Earthquake
- Manipur
- Myanmar
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

