Bihar Poll Schedule | బీహార్ (Bihar)లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సరవణ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. సవరించిన ఓటరు జాబితా (Voter List) ఫైనల్ లిస్ట్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) నేడు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఫైనల్ లిస్టును ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిసింది. ఇక వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను (Bihar Poll Schedule) కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.
అక్టోబర్ 6-7 తేదీల మధ్య ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అక్టోబర్ 4, 5 తేదీల్లో పాట్నాలో ఎన్నికల సన్నద్ధతపై ఈసీ సమీక్ష జరపనుంది. గతంలోలానే ఈ సారి కూడా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. అక్టోబర్ 25 నుంచి 28 వరకు ఛత్ పూజ జరగనుంది. ఛాత్ పూజ ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాలనే యోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 5 నుంచి 15 వరకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 22తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పటిలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ యోచిస్తోంది. కాగా, 2020లో కూడా బీహార్ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో పోలింగ్ నిర్వహించారు. ఫలితాలను నవంబర్ 10న వెల్లడించారు. బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగా, ఆర్జేడీ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రతిపక్షానికే పరిమితమైంది.
Also Read..
PM Modi | పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతికి మార్గం.. గాజాపై ట్రంప్ ఫార్ములాను స్వాగతించిన భారత్
Earthquake | మయన్మార్‌లో భూకంపం.. అస్సాం, మణిపూర్, నాగాలాండ్‌లో ప్రకంపణలు
Bihar | నేడు బీహార్ తుది ఓటరు జాబితా విడుదల..