Anil Kapoor | బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్‌వీర్‌సింగ్ నటించిన సీక్వెల్ ‘ధురంధర్-2’ (Dhurandhar The Revenge). ఆదిత్య ధర్ డైరెక్షన్లో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ‘ధురంధర్: ది రివేంజ్’ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది.
కాగా ఈ చిత్రంలో పాపులర్ బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్‌కు స్పెషల్ రోల్ ఆఫర్ చేశాడట. అయితే అనిల్ కపూర్ మాత్రం తనకు పాత్ర చాలా బాగా నచ్చినా సినిమాకు నో చెప్పాడట. ఇదే విషయంపై ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చాడు.
అవును.. ఆదిత్యధర్ ధురంధర్ 2 కామియో రోల్ కోసం నన్ను సంప్రదించాడు.. కానీ నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నా ప్రొఫెషనలిజం (వృత్తి నైపుణ్యం), నా నిబద్ధత. అది చాలా ముఖ్యం. కేవలం ప్రతిభ మాత్రమే మిమ్మల్ని మీరున్న స్థాయికి తీసుకురాలేదు. ఆ సమయంలో అప్పటికే నేను మరో ఫిల్మ్ మేకర్‌తో సినిమా చేసేందుకు ఒప్పుకున్నా.
నాకు ఆదిత్య ధర్ చెప్పిన కామియో రోల్ చాలా బాగా నచ్చింది.. చేయాలనున్నా కానీ అప్పటికే వేరొకరి కమిట్మెంట్ ఇచ్చానని ఆదిత్యా ధర్‌కు చెప్పా. తను ఇప్పుడు సినిమా విడుదల చేస్తున్నాడు. అతడు అద్భుతమైన సినిమాలో నాకు రోల్ ఆఫర్ చేశాడు. అది చేయకపోవడం నాకే నష్టం. కానీ ఫర్వాలేదు. భవిష్యత్‌లో మేం కలిసి పనిచేస్తామని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు అనిల్ కపూర్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Poorna | పూర్ణ ఇంట్లో అడుగుపెట్టిన మహాలక్ష్మి.. రెండోసారి తల్లైన టాలీవుడ్ నటి
Seasonal Allergies | సీజన్ మారుతోంది.. ఈ సమయంలో వచ్చే అలర్జీల నుంచి ఇలా తప్పించుకోండి..
Uttar Pradesh | కెరీర్‌పై ఫోకస్ చేయమన్నందుకు కవల సోదరి హత్య.. 84 సార్లు కత్తితో పొడిచి చంపిన సోదరుడు