TVK functionary | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కరూర్ జిల్లా (Karur district)లో టీవీకే ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటన రాజకీయపరంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ దుమారం వేళ టీవీకే పార్టీకి చెందిన ఓ కార్యకర్త (TVK functionary) ఆత్మహత్య (suicide) చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
విల్లుపురం జిల్లాకు చెందిన అయ్యప్పన్ (51) టీవీకే పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం తన వృద్ధ తల్లిదండ్రులను చూసేందుకని మైలం గ్రామానికి వెళ్లారు. అయితే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన ఆయన తల్లి మునియమ్మల్ చుట్టుపక్కల వారికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయ్యప్పన్ గదిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పార్టీ చీఫ్ విజయ్ ప్రచారం సందర్భంగా 41 మంది ప్రాణాలు కోల్పోయిన కరూర్ తొక్కిసలాట (Karur stampede)కు డీఎంకే మంత్రి (DMK Minister) సెంథిల్ బాలాజీ (Senthil Balaji), పోలీసులే కారణమని అయ్యప్పన్ సూసైడ్ నోట్లో రాశారు. ‘టీవీకే చీఫ్ విజయ్ కరూర్ వచ్చినప్పుడు తగినంత పోలీసు రక్షణ లేదు. మంత్రి సెంథిల్ బాలాజీ కారణంగానే ఈ విషాదం జరిగింది. ఇందులో పోలీసుల ప్రమేయం కూడా ఉంది. మంత్రిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలి’ అని అయ్యప్పన్ సూసైడ్ నోట్లో రాశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కరూర్‌లో శనివారం రాత్రి నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల కటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున, తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున, కేంద్రం రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
Also Read..
Bihar Poll Schedule | వారం రోజుల్లో బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..!
PM Modi | పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతికి మార్గం.. గాజాపై ట్రంప్ ఫార్ములాను స్వాగతించిన భారత్