Betting App – Enforcement Directorate | బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో విచారణకు రావాలని ఈడీ ఊర్వశి రౌతేలాకి ఈనెల 15న సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకుంది ఉర్వశి. ఈ విచారణలో భాగంగా.. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వాటితో ఉర్వశికి ఉన్న సంబంధాలు ప్రచారానికి తీసుకున్న డబ్బుల గురించి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ఈడీ విచారించింది. ఇటీవల సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, నటి మంచు లక్ష్మి, నటుడు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, సోను సూద్ కూడా విచారణకు హాజరయ్యారు. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించడం, నల్లధనం లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే పలువురు సెలబ్రిటీలను ఈడీ ప్రశ్నిస్తోంది.