MLA Sunitha Lakshma Reddy | చిలిపిచెడ్, ఏప్రిల్ 22 : ఎన్ని సార్లు అధికారులకు చెప్పిన నీటి సమస్య పరిష్కరం కావడం లేదని బద్రియ తండా పరిధిలోని బంజార నగర్ తండా వాసులు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎమ్మెల్యే వెంటనే మిషన్ భగీరథ అధికారులకు ఫోన్ చేయడంతో అధికారులు గిరిజన తండాల్లో ఇంటింటా తిరిగి నీటి సమస్య గురించి తెలుసుకున్నారు.
ఇవాళ తండాకు వచ్చిన మిషన్ భగీరథ డీఈ ప్రవీణ్, ఏఈ అన్వేష్‌రెడ్డి, ఎంపీడీవో ఆనంద్‌ను తండా ప్రజలు అడ్డుకుని నీటి సమస్యపై నిలదీశారు. ఇప్పటికైనా బంజారానగర్ తండాల్లో మంచి నీరు వచ్చేటట్లు ప్రత్యేక చొరవ చూపాలని తండా ప్రజలు అధికారులను కోరారు. ఇన్ని రోజులు మా తండా ప్రజలు మిషన్ భగీరథ అధికారులకు ఫోన్ చేసి చెప్పినా తండాకు వచ్చి నీరు కోసం చర్యలు తీసుకోలేదన్నారు.
ఎమ్మెల్యే ఒక ఫోన్ చేయడంతో మండల,జిల్లా అధికారుల వచ్చి మంచి నీరు కోసం చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డికి తండా వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు సురేష్, ఇన్చార్జ్ ఎంపీవో తిరుపతి, ఏపీవో శ్యామ్‌కుమార్,కార్యదర్శి మోహన్ తండా వాసులు పాల్గొన్నారు.
Drinking Water | మిషన్ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపు కరువు
Kollapur Mangos | కొల్లాపూర్ మామిడి రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్ నాయకులు అభిలాష్ రావు
Rayapol ZPHS | విద్యా వెలుగులకు నెలవై.. రాయపోల్ పెద్ద బడికి నేటికి 60 వసంతాలు