హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్ర భావంతో సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి న భారీ వర్షాలు కురిశాయి. గంటకు 40 కి.మీ ఈదురుగాలుల వేగంతో వర్షాలు కురువడంతో కోతదశలో ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా యి. దీంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది.
ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఆదివారం అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో మంగళ, బుధవారాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.