పాల్వంచ రూరల్, ఫిబ్రవరి 23: పంచాయతీ పనుల్లో సర్పంచ్ భర్త జోక్యం చేసుకుంటున్నారంటూ కార్యదర్శి చెప్పడంతో ఓ మహిళా సర్పంచ్ మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిన ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకున్నది. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం సత్యనారాయణపురం (మొండికట్ట) సర్పంచ్ జర్పుల సంధ్య ఆధ్వర్యంలో గ్రామంలో పనులు జరుగుతున్నాయి.
ఈ పనుల్లో ఆమె భర్త జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని పంచాయతీ కార్యదర్శి బాబా కొద్దిరోజుల క్రితం సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో మనస్తాపం చెందిన సర్పంచ్.. సోమవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై ఆమె భర్త నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.