MLA Sunitha Lakshma Reddy | శివ్వంపేట, జులై 11 : ‘సర్’ సర్వేకు ప్రజలంతా సహకరించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కోరారు. శనివారం శివ్వంపేట మండలం గోమారం గ్రామంలోని ఎమ్మెల్యే నివాసానికి సర్ కార్యక్రమంలో భాగంగా వచ్చిన బీఎల్ఓకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తన వివరాలతోపాటు కుటుంబసభ్యుల వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా సర్వే ఏవిధంగా నిర్వహిస్తున్నారు, ఓటర్ల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారు, ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారనే అంశాలపై బీఎల్ఓను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమాన్ని ప్రజలందరు బాధ్యతగా తీసుకొని పూర్తి సహకారం అందించాలని కోరారు. అర్హులైన ప్రతీఒక్కరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పులు వంటి అంశాల్లో నిర్లక్ష్యం చేయకుండా బీఎల్ఓలకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వేకు సహకరించి సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంధాలయ మాజీ ఛైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ గ్రామకమిటి అధ్యక్షులు జిన్నారం మహిపాల్ రెడ్డి, గంగిరెడ్డి నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.

Riddhi Chauhan: 300 మంది అమెరికా నేవీ క్యాడెట్స్‌కు లీడర్‌గా భారతీయ విద్యార్థిని