MLA Sunitha lakshma Reddy | నర్సాపూర్, సెప్టెంబర్ 9 : కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా మోదీనే ఉన్నాడు కదా… మరీ రాష్ట్రానికి సరిపోయేంత యూరియా ఎలా వచ్చిందని ఎమ్మెల్యే సునీతాలక్మారెడ్డి మండిపడ్డారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులను ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కలుసుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 15 రోజుల నుండి తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఎమ్మెల్యే ముందు వారి బాధలను ఏకరువు పెట్టారు. తిండి తిప్పలు లేకుండా యూరియా కోసం ఎదురుచూస్తే ఒక్క సంచి కూడా ఇవ్వడం లేదని రైతులు తమ బాధను వెల్లగక్కారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం యూరియా ఇవ్వకపోవడంతోనే రైతులకు సరిపోయేంత యూరియా అందించడం లేదని కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రిగా మోదీనే ఉన్నాడు కదా మరి అప్పుడెలా సరిపోయేంత యూరియా పంపిణీ జరిగిందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేక సరైన ఆలోచన లేక నేడు రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. పది సంవత్సరాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సకాలంలో ఎరువుల మందులను పంపిణీ చేశారని గుర్తుచేశారు. నేడు యూరియా కావాలంటే జిరాక్సులు తీయడానికే రైతుల సమయం సగం సరిపోతుందని, జిరాక్సులు అందజేసినా ఒక్క సంచి యూరియా కోసం నాలుగైదు రోజులు ఎదురుచూడాల్సి వస్తుందని అన్నారు. రైతులకు యూరియా సరఫరా అయ్యేంత వరకు విశ్రమించబోమని, దీని కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న రైతులు నేడు అర్ధరాత్రి యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. మేము ధర్నాలు చేస్తేనే ప్రభుత్వం యూరియా సరఫరా చేస్తుందని… ఇలా అయితే ప్రతి రోజు రైతుల కోసం ధర్నాలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యంతోనే నేడు రైతులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Mla Sunitha Lakshma Reddy1
Nepal | ఆగని ఆందోళనలు.. ఓలి రాజీనామాకు డిమాండ్.. మాజీ ప్రధాని ఇంటిని ధ్వంసం చేసిన నిరసనకారులు
BRS | రైతులకు సరిపడా యూరియా అందించండి.. కాల్వశ్రీరాంపూర్లో బీఆర్ఎస్ రాస్తారోకో
Aishwarya Rai | AIతో అశ్లీల కంటెంట్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య రాయ్