MLA Sunitha Lakshma Reddy | కొల్చారం, ఏప్రిల్ 12 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పిలుపునిస్తున్నారు.
ఇందులో భాగంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్వదస్తూరితో గోడపై వాల్ రైటింగ్ వేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో భాగంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కొల్చారం మండల పరిధిలో పర్యటించారు. శుక్రవారం సాయంత్రం రంగంపేట నుండి సంగాయి పేటకు వెళుతుండగా జోగిపేట- మెదక్ రోడ్డు పక్కన ఓ గోడపై పేయింటర్ బీఆర్ఎస్ రజతోత్సవ మహా సభ వాల్ రైటింగ్ వేస్తూ కనిపించాడు.
అది గమనించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కారు దిగి అక్కడికి వెళ్లారు. పెయింటర్ బార్డర్ గీసి తెల్ల రంగు వేసి సిద్దంగా ఉంచిన గోడపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్వయంగా పెయింటింగ్ బ్రష్ చేత పట్టుకుని స్వదస్తూరితో తెలుగులో ‘కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి’, ‘ఛలో వరంగల్’ అనే నినాదాలు రాశారు.
ఎమ్మెల్యే గోడపై రాస్తున్నంత సేపు నాయకులంతా ఆసక్తిగా తిలకించారు. ఎమ్మెల్యేతో పాటు పార్టీ మండలాధ్యక్షుడు గౌరీ శంకర్, యువత అధ్యక్షుడు సంతోష్ రావు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మన్ అరిగె రమేష్, మాజీ ఎంపీపీ మంజూల కాశీనాథ్, ఇంద్రసేనా రెడ్డి, విష్ణు వర్దన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, మల్లేశం, రాజా గౌడ్, దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!