MLA Harish Rao | టేక్మాల్ : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలను టేక్మాల్ మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్యన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్బంగా భక్తుల వీరప్ప మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పని చేసే నాయకుడు హరీష్రావు అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ చేసి మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిద్దయ్య, భాస్కర్, సుధాకర్, రవి, కిషన్, గోవిందాచారి, సాయిబాబా, దుర్గయ్య, మాణిక్యం, రజాక్, మల్లేశం, యాదయ్య ఉన్నారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా