e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home మెదక్ అర్హులందరికీ ఆహర భద్రత

అర్హులందరికీ ఆహర భద్రత

  • లబ్ధిదారులకు రేషన్‌కార్డులు
  • కొత్తకార్డులు అందించిన ప్రజాప్రతినిధులు
  • మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, పటాన్‌చెరులో శాసన మండలి ప్రొటెం చైర్మన్‌, ఎమ్మెల్యేలు
  • ఆనందంలో పేద ప్రజలు

మెదక్‌, జూలై 26 : నిరుపేదలు ఆకలితో ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కార్డులు అందజేస్తున్నారని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన మెదక్‌లోని ద్వారకా గార్డెన్‌లో మెదక్‌ పట్టణం, మెదక్‌ మండలం, హవేళీఘనపూర్‌ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. మెదక్‌ మండలానికి చెందిన 165 మంది, హవేళీఘనపూర్‌ మండలానికి చెందిన 122 మంది లబ్ధిదారులకు నూతన ఆహార భద్రత కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలు ఎవరూ కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నూతనంగా రేషన్‌ కార్డుల పొందిన వారందరూ ఆగస్టు నెల నుంచి రేషన్‌ సరుకులు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, డీఎస్‌వో శ్రీనివాస్‌, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్‌ భానుప్రకాశ్‌, కౌన్సిలర్లు, ఆయా మండలాల లబ్ధిదారులు పాల్గొన్నారు.

రామాయంపేట మండలంలో 193మందికి..
రామాయంపేట, జూలై 26 : తెలంగాణ రాష్ట్రం కరోనాతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. సీఎం కేసీఆర్‌ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం రామాయంపేటకు విచ్చేసిన ఎమ్మెల్యే మండలంలో అర్హులైన 193 మంది లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మెదక్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 933 కొత్త రేషన్‌ కార్డులు మంజూరయ్యాయన్నారు. జూన్‌ 8వ తేదీన రామాయంపేట మండలంలో ఆన్‌లైన్‌లో రేషన్‌ కార్డులకు దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులందరికీ ప్రభుత్వం కొత్తగా 193 కార్డులు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో డీఎస్‌వో శ్రీనివాస్‌, ఆర్డీవో సాయిరాం, రామాయంపేట ఎంపీపీ భిక్షపతి, జడ్పీటీసీ సంధ్య, మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ యాదగిరి, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, తాహసీల్దార్‌ శేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌, మేనేజర్‌ శ్రీనివాస్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, కౌన్సిలర్లు యాదగిరి, నాగరాజు, గంగాధర్‌, సుందర్‌సింగ్‌, అనిల్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పేద ప్రజలు ఆకలితో పస్తులు ఉండొద్దు..
చేగుంట, జూలై 26 : పేద ప్రజలు ఆకలితో పస్తులు ఉండొద్దని, వారి సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. నార్సింగి మండల కేద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం శేరిపల్లి, సంకాపూర్‌, జెప్తిశివునూర్‌ గ్రామాల్లోని 41మంది లబ్ధిదారులకు ఆహారభద్రత కార్డులను అందజేశారు. కార్యక్రమంలో మెదక్‌ ఆర్డీవో సాయిరాం, డీఎస్‌వో సత్యనారాయణ, నార్సింగి ఎంపీపీ సబిత, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, వైస్‌ ఎంపీపీ సుజాత, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు తౌర్యానాయక్‌, రాజు, నార్సింగి సొసైటీ చైర్మన్‌ శంకర్‌గౌడ్‌, ఎంపీడీవో ఆనంద్‌మేరి, తహసీల్దార్‌ సత్యనారాయణ, సర్వేయర్‌ శ్రీకాంత్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీటీసీలు సంతోష, సుజాత, సర్పంచులు మల్లేశం, ఆర్‌ సుజాత, భూలక్ష్మి, షేక్‌ షరీఫ్‌ పాల్గొన్నారు.

అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి..
చిన్నశంకరంపేట, జూలై 26 : అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎ మ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే చిన్నశంకరంపేటలో లబ్ధిదారులకు రేషన్‌కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చిన్నశంకరంపేట మండలానికి 100 రేషన్‌కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. రాని వారికి కూడా త్వరలోనే అందిస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ భాగ్యలక్ష్మి, తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలశాఖ అధ్యక్షుడు రాజు, సర్పంచ్‌ రాజిరెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

అర్హులందరికీ రేషన్‌కార్డులు అందజేస్తాం..
పాపన్నపేట, జూలై 26 : అర్హులందరికీ రేషన్‌కార్డులు అందజేస్తామని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన పాపన్నపేటలోని ఐకేపీ కార్యాలయంలో నూతనంగా మంజూరు చేసిన రేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పాపన్నపేట మండలంలో 233 మందికి తెల్లరేషన్‌కార్డులు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్‌ లక్ష్మణ్‌, జడ్పీటీసీ షర్మిలా, వైస్‌ ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కుమ్మరి జగన్‌, సొసైటీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తాడెపు సోములు, సర్పంచ్‌లు గురుమూర్తిగౌడ్‌, మల్లేశం, బాచారం, వెంకట్‌రాములు పాల్గొన్నారు.

రేషన్‌ కార్డులు ఇవ్వడం సంతోషంగా ఉంది..
సీఎం కేసీఆర్‌ మా పేద ప్రజలకు నూతన రేషన్‌ కార్డులను ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నూతనంగా అందజేసే రేషన్‌ కార్డుల్లో అన్ని కుటుంబాల కుటుంబాల సభ్యుల పేర్లు నమోదు కానున్నాయి. గతంలో రేషన్‌ కార్డుల్లో కొందరి పేర్లు మాత్రమే ఉండేవి కానీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి ఒక్కరి పేరును రేషన్‌ కార్డులో నమోదు చేసి అందిస్తున్నది. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.

  • మద్దెల చంద్రం, రైతు మిరుదొడ్డి

పేద కుటుంబాలకు ఎంతో మేలు ..
కొత్త రేషన్‌కార్డు కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో మా ఇబ్బందులు తొలిగిపోయాయి. ఆహార భద్రత కార్డు లేకపోవడంతో ఇప్పటి వరకు పభుత్వం అందించే సరుకులు, సంక్షేమ పథకాలు అందుకోలేక పోయాం. ఇప్పుడు కార్డు రావడంతో ఆరోగ్యశ్రీ పని చేస్తుంది. మాలాంటి ఎన్నో పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది.

  • శివగారి యాదగిరి, ర్యాలమడుగు మెదక్‌ మండలం

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు ..
నాకు రేషన్‌ కార్డు మంజూరైంది. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో కొన్నేండ్లుగా ఎదురుచూస్తున్న మా కుటుంబానికి కొత్త రేషన్‌ కార్డు మంజూరయ్యింది. పేద వారి కోసం నూతన రేషన్‌ కార్డులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. వచ్చే నెల నుంచి రేషన్‌ షాపుల్లో అందరిలాగే మాకు సరుకులు రానున్నాయి. చాలా సంతోషంగా ఉంది.

  • నార్లపురం మానస, నంగునూరు మండలం, ముండ్రాయి

చాలా సంతోషంగా ఉంది..
ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డును మంజూరు చేసింది. చాలా సంతోషంగా ఉంది. మొన్నటివరకు రేషన్‌కార్డు లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఏ అవసరంవున్నా రేషన్‌కార్డు కావాల్సి వచ్చేది. చాలా సందర్భాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ, ఇప్పుడు ప్రభుత్వం రేషన్‌ కార్డు మంజూరు చేయడంతో ఆ ఇబ్బందులు తొలిగిపోతాయి.

  • మీన, నాగుల్‌దేవులపల్లి, హత్నూర

సీఎం కేసీఆర్‌ సల్లంగా ఉండాలి..
పది సంవత్సరాలుగా రేషన్‌ కార్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వ హయాంలోని పాలకులకు ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. ప్రతి నెలా బియ్యం లేక చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ, ఇప్పుడు ఆ బాధ తప్పింది. తెలంగాణ ప్రభుత్వం రేషన్‌కార్డును మంజూరు చేసింది. చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌ సల్లగా ఉండాలి.

  • బత్తని మమత, కమాల్‌పల్లి

చాలా ఆనందంగా ఉంది..
ప్రభుత్వం నాకు కొత్త రేషన్‌కార్డు మంజూరు చేసింది. చాలా ఆనందంగా ఉంది. నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను ఉపాధి కోసం మహారాష్ట్ర నుంచి రామేశ్వరం బండ గ్రామం వీకర్‌ సెక్షన్‌ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్న. నేను దివ్యాంగుడిని. ప్రభుత్వం ద్వారా పింఛన్‌ సహాయాన్ని పొందుతున్న. ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో ఇప్పుడు నేను కుటుంబంతో హాయిగా ఉంటున్నాను. సీఎం కేసీఆర్‌ సార్‌కు ధన్యవాదాలు. – సోని ఆనంద్‌ దౌలే దివ్యాంగుడు, రామేశ్వరం బండ, వీకర్‌సెక్షన్‌ కాలనీ

రేషన్‌కార్డు మంజూరైంది..
ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని కొత్త వారికి రేషన్‌ కార్డులు అందజేస్తున్నది. నేను గతంలోనే రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న. తాజాగా రేషన్‌ కార్డుల లిస్ట్‌లో నాకు రేషన్‌కార్డు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మాకు రేషన్‌ ద్వారా సరుకులు పొందేలా కార్డు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.

  • రేకులపల్లి వెంకట్‌రెడ్డి, నంగునూరు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana