సంగారెడ్డి, మే 12(నమస్తే తెలంగాణ) : జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి సోమవా రం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వ హణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూరి ్తచేశారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1973 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం సాయంత్రంకు ఈవీఎంలు, పోలిం గ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సోమవారం ఉదయం 7గంటల నుంచి సా యంత్రం 6 వరకు ఓటింగ్ జరగనుంది. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల అధికారి వల్లూ రు క్రాంతి ఎన్నికల ఏర్పాట్లను ఆదివారం సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, ఓటర్లకు ఇబ్బంది కలగకుం డా ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియో గించుకోవాల్సిందిగా ఓటర్లను ఆమె కోరారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ 2500 మందికిపైగా పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశా రు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లోని 16,40,755 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగిం చుకోనున్నారు. జహీరాబాద్ పరిధిలో మొత్తం 16,40,755 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8,01,563 మంది పురుష, 8,39,133 మ హిళా ఓటర్లు ఉన్నారు.

ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల అధికారులు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 1973 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జుక్కల్‌లో 255, కామారెడ్డిలో 266, ఎల్లారెడ్డిలో 270, బాన్సువాడలో 258, అందోలులో 313, నారాయణఖేడ్‌లో 298, జహీరాబాద్‌లో 313 పోలింగ్ కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో 2344 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 2344 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 4688 ఇతర పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో హ్యాట్రి క్ విజయం సాధించటం ఖాయమని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. జహీరాబాద్ పార్లమెంట్ బరిలో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా రు. బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్‌కుమార్, కాంగ్రెస్ నుంచి సురేశ్ షెట్కార్, బీజేపీ నుంచి బీబీ పాటిల్ పోటీ చేస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండుమార్లు ప్రజలు బీఆర్ఎస్కు పార్టీకి పట్టం కట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ సామాజికవర్గానికి చెందిన గాలి అనిల్‌కుమార్‌ను బరిలో నిలిపింది.

గాలి అనిల్‌కుమార్ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటర్లను కలిసి గెలిపించాల్సిందిగా కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరు లు గాలి అనిల్‌కుమార్ గెలుపుకోసం ప్రచారం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ బలంగా ఉండటంతో పాటు ప్రజలు కాం గ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై వ్యతిరేకతతో ఉన్నా రు. పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం జహీరాబాద్ పార్లమెంట్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు.
బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రజలకు అందుబాటులో ఉండరు అన్న అపప్రథ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఏఒక్క హామీ ని నెరవేర్చలేదు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను నిలబెట్టుకోవటంలో కాంగ్రెస్ విఫలమైంది. దీంతోప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపడం లేదు. తెలంగాణ, జహీరాబా ద్ అభివృద్దికి కట్టుబడి ఉన్న బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దీంతో జహీరాబాద్ పార్లమెంట్లో మూడోసారి బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.