Artists | చిలిపిచెడ్, అక్టోబర్ 23 : కళాకారులను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజానాట్యమండలి మెదక్ జిల్లా అధ్యక్షుడు బి శేకర్ డిమాండ్ చేశారు. గురువారం చిలిపిచెడ్ మండల కేంద్రంలో పీఎన్ఎం సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా బి శేకర్ మాట్లాడుతూ.. కళాకారులకు గుర్తింపు కార్డు, బస్ పాస్, 50 సంవత్సరాలు నిండిన కళాకారులకు 5000 రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే చిలిపిచెడ్ మండల నూతన కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడిగా ప్రశాంత్, కార్యదర్శిగా దత్తు, కమిటీ సభ్యులుగా కే వెంకటేశం, నర్సింలు, కిరణ్, రాజు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
Watch: రైలు పట్టాలపై రీల్ చేసిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం ఇచ్చే బాధ్యత నాది : కేటీఆర్
Actor Vijay | విజయ్ వాహనాలన్నింటికీ 0277 నంబర్.. దాని వెనుక ఉన్న ఎమోషనల్ కథ తెలుసా..?