Actor Vijay | తమిళనాడు రాజకీయాల్లో స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ (Actor Vijay) ఓ సంచలనంగా మారారు. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు. అయితే, కరూర్ తొక్కిసలాట ఘటనతో ఆ ప్రచార ర్యాలీలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో విజయ్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
విజయ్ వద్ద పలు హైఎండ్ కార్లు ఉన్నాయి. గతేడాది రోల్స్ రాయిస్‌ను అమ్మేసిన తర్వాత తన గ్యారేజ్‌లోకి మూడు కొత్త వాహనాలను యాడ్ చేశారు. అయితే, వాహనం ఏదైనా సరే దాని నంబర్ మాత్రం ఒకటే ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విజయ్ వద్ద ప్రస్తుతం బీఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు, లెక్సస్ ఎల్ఎమ్, టయోటా వెల్ఫైర్ ఉన్నాయి. వీటితోపాటూ ఎన్నికల ప్రచారం కోసం ఓ బస్సును కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ వాహనాలన్నింటికీ ఒకే నంబర్ ప్లేట్ ఉండటం విశేషం. ఆ వాహనాలన్నీ 0277 అనే నంబర్ (0277 Number)తోనే రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి.
బీఎమ్డబ్ల్యూకి TN 14 AH 0277, లెక్సస్ కారుకి TN 14 AL 0277, టొయోటా వెల్ఫైర్కు TN 14 AM 0277, టీవీకే ప్రచార బస్సుకు TN 14 AS 0277.. వీటన్నింటికీ 0277, 14 నంబర్లు కామన్‌గా ఉన్నాయి. అయితే, దీనివెనుక ఓ ఎమోషనల్ కథ ఉన్నట్లు తెలిసింది. విజయ్ చెల్లి విద్య చిన్నతనంలోనే ప్రాణాలు కోల్పోయింది. తనంటే విజయ్‌కి చాలా ఇష్టమట. విద్య చనిపోయిన తర్వాత విజయ్ డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు ఆయన తల్లి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. విద్యకు నివాళిగా ఆమె బర్త్ డే 14-02-77 డేట్‌ను విజయ్ తన వాహనాలకు నంబర్లుగా పెట్టుకోవడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు విజయ్ చర్యను ప్రశంసిస్తున్నారు.
Also Read..
SpiceJet | పాట్నా వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీకి దారిమళ్లింపు
Heavy Rain | భారీ వర్షాలు.. నేడు ఈ ఐదు జిల్లాలకు అలర్ట్
Audi Car: మాజీ మంత్రి కుమారుడు.. ఆడీ కారుతో బీభత్సం