జైపూర్: రాజస్థాన్‌కు చెందిన మాజీ మంత్రి కుమారుడు తన ఆడీ కంపెనీ కారు(Audi Car)తో బీభత్సం సృష్టించాడు. జైపూర్‌లో ఆ కారుతో మరో మూడు కార్లను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆడీ కారులో మంత్రి కుమారుడితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. మంత్రి కొడుకు మైనర్ అని తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ప్రతాప్ నగర్ పోలీసు స్టేషన్ ఏరియాలో ఉన్న ఎన్ఆర్ఐ సర్కిల్ సమీపంలో ప్రమాదం జరిగింది. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారి రాజేంద్ర శర్మ తెలిపారు. పోలీసు కమీషనర్ బీజూ జార్జ్ జోసెఫ్ జోక్యం చేసుకున్న తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు తెలుస్తోంది. భారతీయ న్యాయ సంహితలోని 281, 125ఏ చట్టాల కింద కేసు బుక్ చేశారు. కార్ల ప్రమాదం పట్ల మాజీ మంత్రి షాక్ వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో సహకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.