Labour Officer | రామాయంపేట, జూన్ 16 : రామాయంపేటలో లేబర్ ఆఫీసర్ అందుబాటులో లేక పట్టణ, మండల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యువకులు పేర్కొన్నారు. తమకు నిత్యం అందుబాటులో ఉండేలా లేబర్ ఆఫీసర్‌ను నియమించాలని యువకులు కలెక్టర్‌ను కోరారు. సోమవారం మెదక్‌కు తరలివెళ్లిన రామాయంపేట యువకులు బైరం కుమార్ అధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు వినతి పత్రం అందజేశారు.
మండల కేంద్రంలో ఉండాల్సిన లేబర్ ఆఫీసర్ ఎక్కడో ఉండడం సరైన పద్దతి కాదన్నారు. మండల కేంద్రంలోనే ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. లేబర్ ఆఫీసర్ సమయానికి లేకపోవడంతో మండలంలో ఉన్న కూలీలు లేబర్ కార్డు కోసం దరఖాస్తులు పట్టుకుని తిరుగుతున్నారని తెలిపారు. అంతేగాకుండా ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ అయ్యేలా చూడాలని వినతిపత్రంలో తెలిపారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత