Medak Church | మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 23 : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చి భక్తుల ఏసయ్య నామ సంకీర్తనలతో మార్మోగింది. ఆదివారం కోత కాలపు పండుగను (సంవత్సరాంత కృతఙ్ఞతార్పణల పండుగ) పురస్కరించుకొని భక్తులు తాము పండించిన తొలి పంటలోని దశమ భాగాన్ని ఏసయ్యకు సమర్పించుకున్నారు. ప్రత్యేక ఆరాధన దైవంతో కూడిన ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసయ్య నామస్మరణలతో భక్తి ఉప్పొంగింది.
రైతులు పండించిన పంటల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు తదితర వాటిని ఏసయ్యకు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. చర్చిని మామిడి, అరటి, కొబ్బరి మట్టలు, పూలతో అందంగా అలంకరించారు. ఆదివారం కావడంతో వేలాది మంది భక్తులు, పర్యాటకులతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. జీవితాలలో వెలుగులు నింపే ప్రభువు యేసయ్య అని సీఎస్ఐ మాడరేటర్, మెదక్ ఇంచార్డ్ బిషప్ రెవరెండ్ రుబెన్ మార్క్ అన్నారు. కోతకాలపు పండుగకు హజరైన ఆయన భక్తులనుద్దేశించి దైవ సందేశం చేశారు.
ప్రతి ఒక్కరూ దైవంతో సమానం అన్నారు. మనం పండించిన వాటిని సంవత్సరాంత కృతజ్ఞతతో దేవుడికి సమర్పించుకొనే పండుగ, దేవుడి ఆకలి తీర్చే పండగ కోతకాలపు పండుగ అని పేర్కొన్నారు. ఏసయ్య నమ్ముకున్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతాడన్నారు. అనంతరం ప్రెసిబేటరీ ఇంచార్జి రెవరెండ్ శాంతయ్య తదితరులు దైవసందేశం చేశారు. పలువురు ఆలపించిన ఏసయ్య భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ప్రార్థనల్లో బిషపమ్మ ప్పిస్సిల్లా గురువులు డేవిడ్, జైపాల్, శ్రీనివాసులను భక్తులను ఆశీర్వదించారు. ప్రార్థనల్లో చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, ఫ్రాంక్ జాన్సన్, సంధాన్ సందీప్, సువన్ డగ్లస్, జాయ ముర్రే, తదితరులు పాల్గొన్నారు.


Edupayala | భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల జాతర
Guwahati Test | ముతుస్వామి సూపర్ సెంచరీ.. నాలుగు వికెట్లతో దక్షిణాఫ్రికాను కూల్చిన కుల్దీప్
Vivek Venkataswamy | నర్సాపూర్‌లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు : మంత్రి వివేక్ వెంకటస్వామి