MPDO | కొల్చారం, డిసెంబర్ 20 : కొల్చారం మండల కేంద్రమైన కొల్చారం ఎంపీడీవో రఫీకున్నీసా సమయపాలన పాటించడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఉదయం 11 దాటితే ఎంపీడీవో సీట్లోకి రారని, సాయంత్రం 4 గంటలు కాకముందే వెళ్లిపోతారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం సైతం ఎంపీడీవో సహా పలువురు సిబ్బంది కార్యాలయానికి రాలేదు. ఫోన్ ద్వారా ఎంపీడీవోను సంప్రదించగా.. గత వారం రోజుల నుండి ఎలక్షన్ డ్యూటీలో అధిక పని ఒత్తిడికి గురయ్యామని, అందుకే రెస్ట్ తీసుకుంటున్నట్లు చెప్పారు.
శనివారం సైతం ఉదయం 11:30 దాటినా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకోలేదు. ఫోన్ ద్వారా సంప్రదించగా జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఎంపీడీవో పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలలో ఫీల్డ్ విజిట్ చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి రాకుండా, ఫీల్డ్ విజిట్ చేయకుండా.. ఉన్నతాధికారి కార్యాలయంలో ఉన్నానంటూ విధుల నుండి తప్పించుకు తిరుగుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పనులు సక్రమంగా చేయడం లేదంటూ ఎవరైనా ప్రశ్నిస్తే ఆరోగ్యం బాగా లేదంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొల్చారం ఎంపీడీవోకు ఇప్పటికీ గ్రామంలోని పంచాయతీల పేర్లు కూడా తెలవదు అని విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు ఎంపీడీవో కార్యాలయంపై కన్నేసి ఉంచి అధికారులు సక్రమంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

శిథిల పంచాయతీలు.. నూతన జీపీల్లో భవనాల నిర్మాణానికి కేసీఆర్ నాడు శ్రీకారం
Insurance Claim | తండ్రిపై రూ.3 కోట్ల బీమా చేశారు.. పాముకాటుతో చంపించారు..
PilotAttack: ప్రయాణికుడిని కొట్టిన పైలట్.. సస్పెండ్ చేసిన ఎయిర్ ఇండియా