KCR Colony | రామాయంపేట, జూలై 09 : కాలనీలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండి కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలని రామాయంపేట ఎస్సై బాలరాజు పేర్కొన్నారు. బుధవారం ఓ కేసు విషయంలో రామాయంపేట పట్టణ శివారులో ఉన్న కేసీఆర్ కాలనీ డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల పరిసరాలను పరిశీలించి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని పరామర్శించి కాలనీ వాసులతో మాట్లాడారు. తనకు తెలిసినంత వరకు ప్రభుత్వం ఇచ్చిన డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లలో మన కేసీఆర్ కాలనీలో ఉన్న ఐక్యత ఎక్కడా కూడా కనబడలేదన్నారు.
కాలనీలో కమిటీ వేసుకుని గత మూడేండ్లుగా అందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వంపై ఆశ పెట్టుకోకుండా కమిటీ అధ్వర్యంలో కాలనీ వాసులే కాలనీలో స్వచ్చందంగా ముందుకు వచ్చి పనులు చేసుకోవడం బాగుందన్నారు. ఎక్కడ కాలనీలు ఉన్నా ఇంత పరిశుభ్రత లేదన్నారు. కాలనీలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమేగాకుండా రామాయంపేటకే కేసీఆర్ కాలనీ అందాన్ని ఇస్తుందన్నారు.
కాలనీవాసులు అందరూ కలిసి ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కాలనీలో వీధిలైట్లు, రోడ్లు, పచ్చని హరితహారం మొక్కలను పెంచి కాపాడుకోవడం బాగుందన్నారు. ఎస్సై వెంట కమిటీ సభ్యులు ఎల్లాగౌడ్, అవుసుల రవి, గొంగళ్ల వెంకటి, ఇమ్రాన్, చంద్రం, చాంద్‌పాష, రమేశ్, శ్రీనివాస్, స్వామి, బాలకృష్ణ, యాదగిరి తదితరులు ఉన్నారు.
Nizampet | రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : సోమలింగారెడ్డి
Dangerous Roads | నిత్యం ప్రమాదపు అంచున.. రోడ్ల మరమ్మతుల కోసం ప్రజల ఎదురుచూపు
Garbage | ఎక్కడ చూసినా వ్యర్థాలే.. వ్యవసాయ మార్కెట్ యార్డు కంపుమయం