Indiramma Beneficiary | రామాయంపేట, జూన్ 11 : ప్రభుత్వం, స్థానిక కాంగ్రెస్ నాయకులు లబ్దిదారుడికి ఇల్లు మంజూరైందని చెప్పి చివరకు జాబితాలో పేరును తొలగించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన లబ్దిదారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మంగళవారం అర్దరాత్రి చోటుచేసుకుంది.
కుటుంబసభ్యులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుకలి అశోక్‌కు స్థానిక నాయకులు మొదటి విడతలోనే ఇల్లు మంజూరైందని తెలిపారన్నారు. దీంతో అశోక్‌కు ఉన్న పూరి గుడిసెను తీసేసి నూతనంగా అదే స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టాడు. ఇల్లు దాదాపు లెంటల్ లెవల్ వరకు వచ్చింది. ఇంటికి ద్వారం కూడా ఎక్కించాడు.
చివరకు లబ్ధిదారుడికి ఇల్లు మంజూరు కాలేదని ఇళ్ల జాబితాలో పేరును తొలగించడంతో తీవ్ర కలత చెందాడు. ఉన్న పూరి గుడిసెను తొలగించి అదే స్థలంలో అప్పు చేసి నూతనంగా ఇంటి నిర్మాణం చేపడితే అధికారులు, నాయకులు తనకు ఇంటి జాబితాలో పేరు లేదనడం అశోక్‌ను కృంగదీసింది. దీంతో చేసేదేమి లేక మనస్తాపం చెందిన ఆయన ఇంట్లోనే ఓ గదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఇది తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే అదే రాత్రి 108 అంబులెన్సులో మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. ప్రభుత్వం అధికారులు, స్థానిక నాయకులు తమకు ఇల్లు మంజూరైందని చెప్పి చివరకు జాబితాలో పేరు లేదనడం సమంజసం కాదని కుటుంబీకులు ఆరోపించారు. అసలు ఇల్లే లేని ఎరుకల అశోక్‌కు కచ్చితంగా ప్రభుత్వం ఇల్లును మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్‌లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు