పోలింగ్ వేళ ఐఏఎస్‌ల బదిలీలా?
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండగానే కాంగ్రెస్ ప్రభు త్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేయ డం ఏంటని అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఇతర నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బెదిరింపులతోనే బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.
- రాష్ట్రంలో అసలు ఎన్నికల సంఘం ఉందా?
- కాంగ్రెస్ బెదిరింపుల వల్లే బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య
- 30% ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండగానే కాంగ్రెస్ ప్రభు త్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేయ డం ఏంటని అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఇతర నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బెదిరింపులతోనే బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ నేతలు పోలింగ్ బూత్‌ల వారీగా పోలీసుల సమక్షంలోనే విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. దీనిపై తాము ఫిర్యాదు చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉం దా..? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించడమే అని మండిపడ్డారు.
గజ్వేల్, నల్లగొండ కార్పొరేషన్లను విభజించడం చట్ట వ్యతిరేక నిర్ణయమని విమర్శించారు. బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం 12% కమీషన్ వసూలు చేస్తే, తెలంగాణలో 30% ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో వసూలు చేసిన ఆర్ఆర్ ట్యాక్స్‌ను మొదటి విడతగా కేరళ ఎన్నికలకు మళ్లించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కార్పొరేషన్ల ఏర్పాటులో రాష్ట్ర ఎన్నికల సంఘం విధివిధానాలు, సెన్సస్ మార్గదర్శకాలను సర్కార్ ఉల్లం ఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

