Sand Dumps | రామాయంపేట, మార్చి 25 : అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న మూడు ఇసుక డంపులను స్వాధీన పర్చుకున్నట్లు జిల్లా మైనింగ్ అధికారి, ఆర్ఐ లక్ష్మినారాయణ, అసిస్టెంట్ జియాలజిస్టు మధుకుమార్, రామాయంపేట ఆర్ఐ గౌస్‌లు తెలిపారు.
ఇవాళ రామాయంపేటకు విచ్చేసిన మైనింగ్ అధికారులు పట్టణంలోని కామారెడ్డిలో అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా గత కొన్ని రోజులుగా అధిక ధరలకు విక్రయిస్తు అమ్మకాలు జరుపుతున్న మూడు ఇసుక డంపులను పట్టుకుని సీజ్ చేశారు. అనంతరం ఇసుకను టిప్పర్ల ద్వారా రెవెన్యూ కార్యాలయానికి తరలించారు.
జిల్లా మైనింగ్ అధికారి లక్ష్మినారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక డంపులను తమ ఆధీనంలో ఉంచుకున్నామని ఇసుకను విక్రయించిన వారికి నోటీసులతోపాటు జరిమానాలను విధిస్తామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఇసుకను త్వరలోనే వేలం వేస్తామని తెలిపారు. ఇలాంటి విక్రయాలు మళ్లీ జరిగితే జరిమానాలతోపాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?