Ration Rice Bags | రామాయంపేట, మార్చి 25 : ఇవాళ తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు డీసీఎం వాహనంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అర్థరాత్రి ఓ గుర్తుతెలియని డీసీఎంలో నుండి రేషన్ బియ్యం బ్యాగులు పడిపోయాయి. రామాయంపేట పట్టణ ప్రధాన రహదారిపై డీసీఎంలో నుండి ఆరు బస్తాలు పడిపోయిన సంఘటన కలకలం రేపుతుంది.
డీసీఎం వాహనం రామాయంపేట పట్టణానికి చేరుకోవడంతోనే ప్రధాన రహదారిలో బియ్యం బస్తాలు ఆరు వరకు సుమారు రెండున్నర క్వింటాళ్ల బియ్యం సంచులు పడిపోయాయి. స్థానికులు అప్పటికే అక్కడికి చేరుకోవడంతో డీసీఎం డ్రైవర్ డీసీఎం వాహనాన్ని తీసుకుని పరారయ్యాడు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఎస్సై బాలరాజు ఘటనాస్థలికి చేరుకుని అక్రమంగా పడిపోయి ఉన్న బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఎస్సై బాలరాజు విలేకర్లతో వెల్లడించారు.
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?