Child Marriage | నర్సాపూర్, నవంబర్ 16 : నర్సాపూర్ పట్టణంలోని సంగారెడ్డి మార్గంలో గల క్లాసిక్ గార్డెన్లో జరుగుతున్న బాల్యవివాహాన్ని ఆదివారం ఐసీడీఎస్, పోలీస్ అధికారులు అడ్డుకొని వివాహాన్ని నిలిపివేశారు. అనంతరం ఇరువురి తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ పెళ్లికి సంబంధించిన వధూవరులు సంగారెడ్డి జిల్లాకు చెందినవారు కావడంతో సంగారెడ్డి ఐసీడీఎస్, అధికారులకు ఈ కేసును అప్పగించడం జరిగిందని డీడబ్ల్యూఓ భార్గవి వెల్లడించారు.
అనంతరం డీడబ్ల్యూఓ హేమ భార్గవి మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడైనా వివాహాలు జరిగితే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు, ఫోటోగ్రాఫర్లు, బ్యాండ్ వారు, పురోహితులు, పాస్టర్లు, కాజాలు తప్పకుండా అమ్మాయికి, అబ్బాయికి వివాహ వయసు తెలుసుకోవాలని సూచించారు.
ఒకవేళ వారికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండని పక్షాన తొలి దశలోనే బాల్యవివాహం జరగకుండా చూసుకోవాలన్నారు. బాల్యవివాహాలను ఆపడం ద్వారానే బాల్యాన్ని రక్షించుకున్న వాళ్లం అవుతామని వెల్లడించారు. ఇతర జిల్లా వారైనా ఇట్టి ప్రాంతంలో బాల్యవివాహాలు జరిగితే ఫంక్షన్ హాల్ యాజమాన్లు వయసు నిర్ధారణ చేసుకొని ఆధార్ కార్డు ప్రామాణికం కాకుండా బర్త్ సర్టిఫికెట్ లేదా విద్యా అర్హత సర్టిఫికెట్ చూసి వయసు నిర్ధారణ చేసుకోవాలని కోరారు.
బాల్యవివాహాన్ని అడ్డుకున్న వారిలో అంగన్వాడీ టీచర్లు అన్నపూర్ణ, స్వప్న, చైల్డ్ లైన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గంగాధర్, నర్సాపూర్ ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.


Yadadri | యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు
Stretching | ఫిట్‌గా ఉండటానికి వ్యాయామం సరే!.. మరి ఫ్లెక్సిబిలిటీ సంగతేంటి?
Robbery | యజమానిని కట్టేసి.. 50 లక్షల విలువైన బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లిన నేపాల్ ముఠా