Pushpam Priya : ప్లూరల్స్ పార్టీ చీఫ్ (Plurals party Chief) పుష్పమ్ ప్రియాచౌదరి (Pushpam Priya Choudhary) బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) లో మళ్లీ ఓడిపోయారు. ఎన్నికల్లో గెలిచేవరకు మాస్క్ తీయనని శపథం చేసిన ఆమె.. ఆ శపథం మేరకు ఇప్పుడు మాస్క్ (Mask) తీసేనా, లేదంటే మళ్లీ ఎన్నికల దాకా వేచిచూస్తారా..? అనేది జనాల్లో ఇంటరెస్టింగ్ టాపిక్‌గా మారింది.
ఈ ఎన్నికల్లో దర్భంగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన పుష్పం ప్రియ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఏకంగా ఎనిమిదో స్థానానికి ఆమె పరిమితమయ్యారు. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి సంజయ్ సరావ్గీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో కూడా అక్కడ ఆయనే గెలిచారు. పుష్పం ప్రియ మాత్రం రెండు పర్యాయాలు ఓటమి మూటగట్టుకున్నారు.
కాగా కులమత రాజకీయాలకు అతీతంగా బీహార్‌కు కొత్త బ్రాండ్‌ను తీసుకువచ్చే లక్ష్యంతో పుష్పం ప్రియ 2020లో ‘ద ప్లూరల్స్ పార్టీ’ని ప్రియ స్థాపించారు. విజిల్ గుర్తుపై మొత్తం 243 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపారు. ఎప్పుడూ నల్లటి దుస్తులు, మాస్క్ ధరించి బయట కనిపించే ఆమె.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతనే తాను మాస్క్ తీస్తానని ప్రతిజ్ఞ చేశారు. కానీ రెండు పర్యాయాలు ఓటమినే చవిచూశారు.
ఈ నేపథ్యంలో పుష్పం ప్రియ ఇప్పటికైనా మాస్క్ తీస్తారా.. లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వేచిచూస్తారా..? అనేది ఇప్పుడు ఆసిక్తికరమైన అంశంగా మారింది. కాగా పుష్పం తండ్రి వినోద్ కుమార్ చౌదరి జేడీయూ నేత, మాజీ ఎమ్మెల్యే. ఆమె తాత ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితులు. ఆమె మామ వినయ్ కుమార్ కూడా జేడీయూలోనే ఉన్నారు.
పుష్పం ప్రియ యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ పూర్తిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు బీహార్ పర్యాటక, వైద్య విభాగంలో కన్సల్టెంట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. 2020 ఎన్నికల్లోనూ ఆమె పార్టీ 148 స్థానాల్లో పోటీ చేసి ఓటమిని చవిచూసింది. తాజా ఓటమితో మరి మాస్క్ తీస్తారా.. లేదా..? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.