koragajja | గ్రామీణ సంస్కృతి, ఆచారాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన కాంతార బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో హిట్‌గా నిలిచిందో తెలిసిందే. కన్నడ నాట నుంచి పలు భాషల్లో విడుదలై పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి టచ్ ఇస్తూ శాండల్‌వుడ్ నుంచి మరో సినిమా రాబోతుంది. అదే ‘కొరగజ్జ’ (korakajja Movie).
కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు, తమిళ్, తులు భాషల్లో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కింగ్ ఆఫ్ ఉడయవరగా కనిపించబోతుండగా.. భవ్య, శృతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. కాంతార సినిమాను గుర్తు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో లీడ్ క్యారెక్టర్ కొరగజ్జ థీమ్‌ను ప్రతిబింబించేలా సరికొత్త గెటప్‌లో కనిపిస్తూ.. కొరగజ్జ మరో కాంతార కాబోతుందని హింట్ ఇచ్చేస్తుంది.
ఈ చిత్రానికి గోపీసుందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీలోని అన్ని పాటలను డైరెక్టర్ కమ్ రైటర్ సుధీర్ అత్తావర్ రాయడం విశేషం. కర్ణాటక తులునాడులో పూజింపబడే దైవం ‘కొరగజ్జ’ కథతో ఈ సినిమా రాబోతుంది.
సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ సాఫల్య నిర్మిస్తున్నారు. రీసెంట్గా కర్ణాటకలోని మంగళూరులో ఆడియో లాంచ్ చేశారని తెలిసిందే. ‘కాంతార’ తరహాలో గ్రామీణ సంస్కృతి, ఆచారాలు కలబోసిన దైవగాథ ఇదని, ప్రేక్షకుల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించేలా ఉంటుందని డైరెక్టర్ సుధీర్ అత్తావర్ క్లారిటీ కూడా ఇచ్చాడు.
Can this be another #Kantara? #Koragajja
Another Pan India devotional film from KFI in a large scale. pic.twitter.com/r0Wxp21aKF
— Karnataka Box Office | ಕರ್ನಾಟಕ ಬಾಕ್ಸ್ ಆಫೀಸ್ (@Kannada_BO) October 13, 2025
#Koragajja directed by Sahitya Akademi Award-winning author and filmmaker #SudheerAthavar – First Look Poster Out Now! pic.twitter.com/xDKVoMDcsV
— Bhargavi (@IamHCB) October 13, 2025
#KoraGajja Team celebrated their grand audio launch, amplifying excitement
The film delves deep into faith, tradition, and the eternal spirit of the divine protector, promising a powerful cinematic experience
All set for its theatrical release soon
A #SudheerAttavar Film &… pic.twitter.com/6KCQMzOUnJ
— BA Raju’s Team (@baraju_SuperHit) November 15, 2025
Akhanda 2 | నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. 3డీ ఫార్మాట్లో ‘అఖండ 2’
Rajkummar Rao | తల్లిదండ్రులైన బాలీవుడ్ స్టార్ దంపతులు
NBK 111 | బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో రిపీట్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!