Nandamuri Balakrishna | హిందూపురం ప్రాంతంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతీయువకులను ఆదుకుంటానని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. నియోజకవర్గంలోని మలుగురు గ్రామంలో రూ.26.5లక్షలతో నిర్మించిన పశువుల ఆస్పత్రిని బాలకృష్ణ ప్రారంభించారు. దీనితో పాటు హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురం అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. తనను మూడుసార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. హిందూరం నియోజకవర్గానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతీయువకులను ఆదుకుంటానని చెప్పారు. ఏపీ మంత్రులంతా హిందూపురం అభివృద్ధిపైనే దృష్టి పెట్టారని తెలపారు.
పశువుల ఆసుపత్రిని ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ
హిందూపురం నియోజకవర్గం మలుగురు గ్రామంలో రూ.26.5 లక్షలతో నిర్మించిన పశువుల ఆసుపత్రిని ప్రారంభించిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ#Balakrishna #TDP #LatestNews #viralvideo pic.twitter.com/hox8rrO78S
— Volga Times (@Volganews_) November 16, 2025
ఇదిలా ఉంటే.. నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2 సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అఖండ సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాను 2డీ వెర్షన్తో పాటు 3డీ ఫార్మాట్లో కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.