Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ కారులో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్, స్థానికులు కలిసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఇక పక్కనే ఉన్న మరో కారుకు మంటలు వ్యాపించే క్రమంలో.. అప్రమత్తమైన డ్రైవర్.. ఆ వాహనాన్ని అటు నుంచి పక్కకు తీశారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.