హైదరాబాద్: నగరంలోని కార్ఖానాలో భారీ చోరీ (Robbery) జరిగింది. పనిచేస్తున్న ఇంటికే నేపాల్ ముఠా కన్నం వేసింది. యజమానికి కట్టేసి పెద్దమొత్తంలో బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. కార్ఖానా పీఎస్ పరిధిలోని గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో కెప్టెన్ గిరి (75) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. అతని ఇంట్లో నేపాల్‌కు చెందిన వ్యక్తి పనిచేస్తున్నారు. మరో నలుగురితో కలిసి చోరీకి ప్లాన్ చేసిన అతడు.. ఇంటి యజమానిపై కర్రలతో దాడి చేశారు. అనంతరం అతడిని కట్టేశారు.
సుమారు రూ.50 లక్షల విలువచేసే బంగారు నగలతోపాటు నగదు ఎత్తుకెళ్తారు. 25 తులాలకుపైగా బంగారం, రూ.23 లక్షల నగదు చోరీ చేశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన కార్ఖానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.