MLA Sunitha laxma Reddy | నర్సాపూర్: అధికారంలో ఉన్న లేకున్నా ప్రతి ఏడాది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తూనే ఉంటానని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఇవాళ నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది ఇఫ్తార్ విందు ఇస్తూనే ఉన్నానని ముస్లిం ప్రజల ఆశీర్వాదాలు నాపై ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. 731 సర్వే నెంబర్లో గ్రేవ్‌యార్డుకు ఐదు ఎకరాల స్థలం ఇవ్వడం జరిగిందని, అది ప్రాసెస్‌లో ఉందని తెలిపారు. మైనార్టీ మహిళలకు ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. అలాగే రెసిడెన్షియల్ స్కూల్, డబుల్ బెడ్ రూమ్ లకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మసియుద్దిన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్, లేబర్ వెల్ఫేర్ బోర్డ్ మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంతోష్ రెడ్డి, శశిధర్ రెడ్డి, చంద్ర గౌడ్, మన్సూర్ హరికృష్ణ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్‌ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు