Panjagutta police seize Vishnupriya’s phone | బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ నోటిసులకు సంబంధించి ఇప్పటికే కొందరు విచారణకు కూడా హాజరు అవ్వగా.. మరికొందరు విచారణకు కొంత సమయం కావాలని కోరారు. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో ఆరోపణలు ఎదుర్కోంటున్న యాంకర్ విష్ణుప్రియ నేడు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యింది. గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆమె.. విచారణకు హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు విష్ణుప్రియను విచారించిన పోలీసులు ఆమె స్టేట్మెంట్ని రికార్డు చేసి ఫోన్‌ని సీజ్ చేసినట్లు సమాచారం.
మరోవైపు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ప్రముఖ నటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో సహా దాదాపు 25 మందిపై సైబారాబాద్‌కి చెందిన మియాపుర్ పోలీసులు నేడు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యువతను చెడగొడుతున్నారని మియాపుర్‌కి చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ప్రమోషన్లను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.
అయితే ఈ ఫిర్యాదును స్వీకరించిన మియాపూర్ పోలీసులు.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖ తెలుగు నటులు రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, ప్రణీత, శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్ల తదితరులపై కేసు నమోదు చేశారు. ఇక సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లలలో నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత వంటి పేర్లు ఉన్నాయి.